నాలుగో రోజు ముగిసిన జగన్ సీబీఐ విచారణ
హైదరాబాద్ :అక్రమాస్తుల కేసుల అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి జగన్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు కోఠి సీబీఐ కార్యాలయానికి తరలించి విచారణ జరిపారు. సుమారు ఆరు గంటలకు పైగా జగన్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం జగన్‌ను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.