నా జీవితం ప్రజాసేవకే తొమ్మిదేళ్ళ అభివృద్ధిని అబద్దం అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం…. పదేండ్ల ప్రజాప్రస్థానం మర్రన్న యాత్రలో ఎమ్మెల్యే మర్రి.జనార్ధన్ రెడ్డి…

నాగర్ కర్నూల్ ఆర్సీ ఆగస్టు26(జనంసాక్షి):నిరుపేద కుటుంబంలో పుట్టి స్వశక్తితో ఎదిగి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ అక్కడే ఆగకుండా పుట్టినగ్రామానికి,జిల్లాకు ఎదైనా చేయాలనే సామాజిక స్పృహతో సేవలలోకెల్లా గొప్ప సేవ అయిన ప్రజాసేవలో పదేండ్లుపూర్తయిన సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ శాసన సభ్యులు మర్రి.జనార్ధన్ రెడ్డి పదేండ్ల ప్రజాప్రస్థానంమర్రన్న పాదయాత్ర కార్యక్రమాన్ని వట్టేం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలకపల్లి మండల పరిధిలోని గౌరారం గ్రామం నుంచి ప్రారంభించారు.పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గ్రామ ప్రజలు,బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుబోనాలతో డప్పులతో ఎమ్మెల్యే మరరికి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గౌరరాం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.పాదయాత్ర లో భాగంగా ఆయన మాట్లాడుతూ,తనను రెండు సార్లుఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను కలిసి ప్రజల ముద్దుబిడ్డగా కన్నకొడుకుగా వారి కష్టసుఖాలనుతెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జిల్లాను అభివృద్ధి పథంలోకి నడిపించానన్నారు.గత పాలకులకు ధీటుగా అనేక సంక్షేమకార్యక్రమాలను చేశానన్నారు. Lమిషన్ భగీరథ ద్వారా కుళాయి తిప్పితే ఇంట్లోనే ఉండి శుద్ధి చేసిన నీటినితాగుతున్నమన్నారు.ఒక నిరుపేద కుటుబంలో పుట్టిన నాకు పేదవారి కష్టాలు తెలుసు కాబట్టే గత తొమ్మిదళ్లుగా సుమారు 1000పేద జంటలకు మర్రి.జనార్ధన్ రెడ్డి ట్రస్ట్ అధ్వర్యంలో వివాహాలు జరిపించానని తెలిపారు.జిల్లాకేంద్రానికి పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఆకలి దప్పులు తీరేలా కేవలం 5రూపాయలకే మధ్యాన్న భోజన వసతికేంద్రాన్ని ఏర్పాటు చేశానన్నారు.అంతేకాకుండా జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయించిప్రారంభించామన్నారు.కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించి ఈ సంవత్సరంలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.అదేవిధంగా గౌరరం గ్రామానికి గత పదేండ్లలో బీఆర్ఎస్ప్రభుత్వం నుంచి రైతుబంధు,మిషన్ కాకతీయ,రైతుభీమ,ఆసరా పింఛన్లు,కల్యాణలక్ష్మి వివిధ పథకాలరూపంలో సుమారుగా 37కోట్ల రూపాయలు వచ్చాయని వివరించారు.అనంతరం చెరువులో ప్రభుత్వంతరుపునుంచి ఉచిత చేప పిల్లలను వదిలారు.అనంతరం పాదయాత్రలో భాగంగా పర్వతాపుర్ గ్రామంలోఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ,సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్నిపూర్తిచేసి నీళ్ళ కోసం ఆకాశం వైపు చూడకుండా చేశామన్నారు.గత ప్రభుత్వాల అసమర్థ పాలన కారణంగాకరెంటు కోసం రైతులు నిద్రలేని పరిస్థితులు ఉండేవని కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వ నిర్ణయాలతో 24గంటలకరెంటుతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.గ్రామానికి 10 కోట్ల రూపాయల నిధులతో జరిగిన వివిధ పథకాలనుతెలిపారు.రాకొండ గ్రామంలో పాదయాత్రలో భాగంగా పలువురి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ పదేండ్లలో ఏం చేశానో తెలిపేందుకే పాదయాత్ర చేస్తున్నానన్నారు.తనను మూడోసారిఎమ్మెల్యే కాకుండా ఓడగొట్టడానికి పలువురు ప్రయత్నిస్తున్నారని వారి ప్రయత్నాలను మీరే తిప్పి కొట్టాలనిపిలుపునిచ్చారు.అనంతరం సుమారుగా 24కోట్ల రూపాయల నిధులతో జరిగిన వివిధ పథకాలను తెలిపారు.ఈపాదయాత్రలో ఎమ్మెల్యే సతీమణి మర్రి.జమున,బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని,శ్రీనివాసయాదవ్,డీసీసీబీడైరెక్టర్ జక్కా. రఘునందన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ నరేందర్ రెడ్డి,జిల్లా గ్రంథాలయచైర్మెన్ మాధవరం.హన్మంతరావు,పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.