నా బర్తరఫ్‌పై సభలో నిలదీస్తా: డీఎల్
హైదరాబాద్,(జనంసాక్షి): నన్నెందుకు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారో శాసన సభ వేదికగా నిలదీస్తాను. నా శాసన సభ్యత్వాన్ని ఎవరూ ఏమీచేయలేరు కదా ? అని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారరెడ్డి అన్నారు. తనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేపి తన నెత్తిన పాలు పోశారని పేర్కొన్నారు. కాగా, నేటి అసెంబ్లీ సమావేశాలకు డీఎల్ గైర్హాజరవడం చర్చనీయాంశమైంది.