నిండుకుండలా సాగర్‌ జలాశయం

పదిగేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు
నల్లగొండ,అక్టోబర్‌16(జనంసాక్షి ): నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టంతో సాగర్‌ జలాశయం నిండు కుండలా మారింది. ఈ క్రమంలో 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్‌ జలాశయం ఇన్‌ఎª`లో, ఔట్‌ఎª`లో 1,29,791 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 590 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 312 టీఎంసీలు.