నిందితులకు ఆంధ్రా పోలీసుల రక్షణ

2

– ఓటుకు నోటు కేసులో కొత్త కోణం

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జనంసాక్షి):

ఓటుకు నోటు కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఏ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య, జిమ్మిబాబుకు ఏపీ పోలీసులు రక్షణ కల్పించినట్లు ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది. నేరస్తులను రాష్ట్రం దాటించడాన్ని ఏసీబీ సీరియస్‌గా తీసుకుంది. నిందితులకు సహాయం చేసిన ఏపీ పోలీసులు, రాజకీయ నేతలకు సోమవారం ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. నిందితులకు ఆశ్రయమిచ్చిన పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల ఫోన్‌ నెంబర్లు, కార్ల వివరాలు, ఆశ్రయం ఇచ్చిన ప్రదేశాలను ఏసీబీ గుర్తించింది. నేరస్తులకు ఆశ్రయం ఇచ్చిన పోలీసు అధికారులు, రాజకీయ నేతలు కూడా నేరస్తులే అని ఏసీబీ పేర్కొంది. బలమైన ఆధారాలు లభించడంతో ఓటుకు నోటు కేసులో ఆంధ్రా పోలీసు అధికారుల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు చేర్చే విషయంపై ఏసీబీ న్యాయ నిపుణుల సలహా తీసుకుంది. ఈ కేసులో నిందితుడైన జెరుసలెం మత్తయ్యకు , అలాగే విచారణకు గైర్‌ హాజరైన టిడిపి యువనేత లోకేష్‌ కారు డ్రైవర్‌ కు కొందరు పోలీసులు ,రాజకీయ నాయకులు సహకరించారని, వారికి నోటీసులు ఇవ్వవచ్చని ఆ వార్త సూచిస్తోంది.తెలంగాణ ఎసిబి అదికారులకు ఈ మేరకు ఆదారాలు దొరికాయని అందువల్ల ఆ పోలీసులకు, రాజకీయ నాయకులకు నోటీసు ఇవ్వడం ద్వారా ఈ కేసును కొత్త మలుపు తిప్పవచ్చని అంటున్నారు. ఇది నిజమే అయ్యే పక్షంలో టిడిపి నేతలకు ,ఎపి పోలీసులకు

నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులకు నోటీసు ఏ రూపంలో ఇస్తారు? ఎవరైనా నిర్దిష్ట అదికారులను ఇందులో గుర్తిచారా?లేక పోలీస్‌ శాఖ ఉన్నతాదికారులకు తెలియచేస్తారా అన్నది చర్చనీయాంశంగా ఉంటుంది.