నిఘా నీడలో హరిప్రియ నగర్ కాలనీ
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) సెప్టెంబర్ 26:
వన్ టౌన్ సీఐ సైదులు సిబ్బందితో కలసి సిద్దిపేట పట్టణం హరిప్రియ నగర్ లో కాలనీ పెద్దలకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి గత వారం రోజుల క్రితం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందుకుగాను అందుకు కాలనీ పెద్దలు దేవేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి మరికొంత మంది పెద్ద మనుషులు కలసి డబ్బులు అందజేయగా సిఐ సైదులు, సీసీ కెమెరాల వెండర్ తో మాట్లాడి కాలనీలో 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం నాడు రాత్రి 9 గంటలకు కాలనీ పెద్దలతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాలనీ పెద్దలకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులును అభినందించారు. సిద్దిపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.


