నిజామాబాద్‌కు అక్బరుద్దీన్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 1 (): వివాదాస్పద వ్యాఖ్యలతో అరెస్టై రిమాండ్‌లో కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీని శుక్రవారం ఉదయం నిజామాబాద్‌కు తరలించారు. నిజామాబాద్ పోలీసులు విచారణ కోసం కస్టడీలో ఇవ్వాలని కోర్టుకు విన్నవించిన మేర శుక్రవారం, శనివారం అక్బరుద్దీన్‌ను తమ కస్టడీలోకి తీసుకొని విచారణ నిమిత్తం నిజామాబాద్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం అక్బరుద్దీన్ తరలింపు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్బరుద్దీన్ ఈ నెల 5వరకు రిమాండ్‌ను పొడగిస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అందరికీ తెలిసిందే. విచారణ అనంతరం తిరిగి ఆదిలాబాద్‌జైలుకు అక్బరుద్దీన్‌ను తరలించనున్నారు.