నితిన్ ఆశలన్నీ మాచర్లపైనే
యూత్ స్టార్ నితిన్ ఆశలన్ని ’మాచర్ల నియోజకవర్గం’ పైనే ఉన్నాయి. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ చిత్రంలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్‌డేట్‌లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ’మాచర్ల ధమ్‌కీ’ అంటూ ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ’మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాదిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం’ అంటూ నితిన్ పలికే డైలాగ్స్‌తో గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలను ఈ గ్లింప్స్ ఒక్కసారిగా రెట్టింపు చేసింది. . ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ’రా రా రెడ్డి’ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 30న జరుపగనున్న విషయం తెలిసిందే.