నితీశ్ ఎన్నికపై హైకోర్టు స్టే
హైదరాబాద్: బిహార్ రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. జేడీయూ శాసనసభాపక్షనేతగా నితీశ్‌కుమార్ ఎన్నికపై పట్నా హైకోర్టు స్టే ఇచ్చింది. జేడీయూ సమావేశం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. నితీశ్ ఎన్నికపై బిహార్ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ మద్దతుదారులు హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది.