నిత్య పెళ్ళికొడుకు ఆస్తులను జప్తు చేయాలి

ఇద్దరు అమ్మాయిలకు న్యాయం చేయాలి
ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని లత డిమాండ్‌
నిజామాబాద్‌,మే 7(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన పవన్‌ కుమార్‌ ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారి వద్ద నుండి లక్షల కట్నం వసూలు చేసి వారిని మోసం చేసిన ఘటనలో నిందితుడిని శిక్షించాలని మహిళా సంగాలు ఆందోళనకు దిగాయి. ఈ మేరకు అతని ఆస్తులను జప్తు చేసి ఆ ఇద్దరు అమ్మాయిలకు న్యాయం చేకూర్చలని సోమవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరుకు వినతి పత్రాన్ని అందచేసారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సబ్బని లత మాట్లాడుతూ పవన్‌ 2011లో మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా టెంబోరని గ్రామానికి చెందిన ఐల బాయిని  9లక్షల కట్నం, 7తులాల బంగారం, పెండ్లి తదు క్రింద 3లక్షల విలువ గల కట్నకానుకలు పుచ్చుకుని వివాహం ఆడాడు. అంతటితో ఆగకుండా మొదటి భార్యకు తెలియకుండా నిర్మల్‌ జిల్లాలోని కుంటాల మండలానికి చెందిన గొల్లముడి గ్రామంలోని దీప అనే మరో అమ్మాయిని 5లక్షల రూపాయలు కట్నంతో పాటు 3తులాల బంగారాన్ని తీసుకుని పెళ్లాడన్నారు. ఇంతటితో ఆగకుండా మరో ఇద్దరు అమ్మాయిలను మోసం చేసే వైపు తన ఆలోచలను పదును పెట్టడన్నారు. ఈ విషయం గ్రహించిన మొదటి భార్య తన అత్తగారి ఇంటిముందు రిలే దీక్షను చేపడితే కొంతమంది రాజకీయ నాయకుల అండదందతో ఆమెను బెదిరించాడని అన్నారు. ఇంతటితో ఆగకుండా అతను దేనికైనా తెగిస్తాడాని తన ఇద్దరి భార్యలు భయబ్రాంతులకు గురి అవుతున్నారని తెలిపారు.  కావున మోసపోయిన ఇద్దరు అమ్మాయిలకు పవన్‌ ఆస్తులను జప్తు చేసి వారి నుండి కట్నం పేరిట వసూలు చేసిన మొత్తన్ని ఇప్పించాలని ఆమె డిమాండ్‌ చేసారు. ఇలా పెళ్ళిలా పేరుతో మోసం చేస్తున్న పవన్‌ వారి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో విజేత మహిళ సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి , బీజేపీ మహిళ అధ్యక్షురాలు సుగుణ , టీ. ఆర్‌.ఎస్‌ మహిళ అధ్యక్షురాలు భూలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు….