నిధులు సమకూర్చిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు.
రజక జాతి అభివృద్ధి పక్కా ప్రణాళికలు.
జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్.
తాండూరు సెప్టెంబర్ 30(జనంసాక్షి)వికారాబాద్
జిల్లాతాండూరు పట్టణంలో ధోబీఘాట్ నిర్మాణం తో పాటు స్మశాన వాటికకు త్రోవ మార్గానికి కలుగుతున్న ఇబ్బందిని ఎమ్మెల్యే మరియు జిల్లా గ్రంధాలయ చైర్మన్ దృష్టికి రజక సంఘం ప్రతినిధులు తీసుకుని వెళ్ళగా సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక చోరవ తీసుకొని ధోబీఘాట్ నిర్మాణానికి రూ. 15 లక్షలతో పాటు స్మశాన వాటికకు రోడ్డు మార్గానికి మరో 5 లక్షలను మంజూరు చేశారు. శుక్రవారం జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ ధోబి ఘాట్, స్మశాన వాటిక రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ రమేష్, కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area