నిధుల కేటాయింపుల్లోనూ వివక్ష: కాంగ్రెస్ నేత డీకే అరుణ
హైదరాబాద్, మార్చి 20: నిధుల కేటాయింపుల్లోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆమె చెప్పారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఆసరా పథకం అందేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సెక్రటేరియట్‌ను ఎర్రగడ్డకు తరలించి.. ఆ హెరిటేజ్ భవనాన్ని ప్రభుత్వం కూల్చాలని చూస్తోందన్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులు.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అరుణ ఆరోపించారు.