నిధుల మంజూరు
జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగులకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ అవసరాలకు అ డ్వాన్సులు, రుణాలకు నిధులకు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు సర్వీసుల సంఘం జగిత్యాల డివిజన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు. ఉద్యోగులకు ఇంటి నిర్మాణం కోసం రుణాలకు జీఓ ఆర్టీ నంబర్ 1955 ద్వారా రూ. 10కోట్ల 16లక్షల 60వేలు, కారు రుణాల కోసం జీఓ ఆర్టీ నంబర్ 1965 ద్వారా రూ. 82.50లక్షలు, కంప్యూటర్ కొనుగోలుకు జీఓఆర్టీ నంబర్ 1957 ద్వారా రూ. 27.50 లక్షలు, సైకిల్ కొనుగోలుకు జీఓఆర్టీ నంబర్ 1958 ద్వారా రూ.2.75లక్షలు , మోటారు సైకిల్ కొనుగోలుకు జీఓఆర్టీ నంబర్ 1959 ద్వారా రూ. 82.50లక్షలు, వివాహ ఖర్చుల కోసం జీఓఆర్టీ 1960 ద్వారా రూ. 1.10 కోట్లు, ఉన్నత విద్యా విద్యావసరాలకు జీఓఆర్టీ నంబర్ 1961 ద్వారా రూ. 2.75కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు హరి అశోక్ కుమార్ తెలిపారు.