నిన్న గుట్ట.. నేడు కరీంనగర్..
– ముస్లింలపై వివక్ష
– నోటికాడ ముద్ద లాగిన జడ్పీ
కరీంనగర్, ఆగస్టు (జనంసాక్షి):
(భాగ్యనగర్ భాస్కర్)
” దేఖ్ తెరె సన్‌సార్‌కి హాలత్ క్యా హో గయ్ భగవాన్ కిత్‌నా బదల్ గయా ఇన్‌సాన్ కిత్‌నా బదల్ గయా ఇన్‌సాన్ సూరజ్ నా బదలా చాంద్ నా బదలా నా బద లారే ఆస్‌మాన్ కిత్‌నా బదల్‌గయా ఇన్‌సాన్” అంటూ మన తెలంగాణలో పాలకులను చూస్తూ 1954 విడు దలైన నాసిక్ సిన్మా పాట పాడుకొనే పాడుబడ్డ రోజులు వచ్చాయ్…. యాదాద్రిలో ముస్లిం నోటికాడ బుక్కను లాగేసే ప్రయత్నం చేస్తే కరీంనగర్ జడ్పీలో ముస్లిం వృ ద్దురాలి నోటికాడి బుక్కను స్వచ్చ భారత్ పేరిట లాగేశా రు. జడ్పీలో నలుబై ఏండ్లుగా అజ్మత్‌మా హోటల్ నడు పుతూ డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న తన ఒక్కగా నొక్క అమాయకుడైన కొడుకును కంటికి రెప్పలాగా కా పాడుకొనేది. జడ్పీ ఛైర్మన్ మంథని పడకంటి కిషన్‌రా వు వంటి మహామహులకు చాయ్ కాసిన ఆచేతులు ఇ ప్పుడు తన హోటల్ తొలగించడంతో అచేతనంగా మారి నాయి. బతుకే బరువుగా
మారింది. జడ్పీలో ఎంతో మందికి ఆచాయ్ హోటల్ నడిపే వృద్దురాలు అన్నా ఆమె కొడుకు అన్నా చాలా అభిమానం అలాంటిది ఏ హెచ్చరిక లేకుండా గుడిసెను కూల్చివేశారు. పోని అక్కడ ఏదైనా బాగు చేశారా అంటే స్వచ్చభారత్ తర్వాత అక్కడ గుడిసె పోవడంతో మరింత దుర్గంద భరితంగా మారింది. తెలంగాణలో సర్వమానవ సౌభ్రాతృత్వం పరిఢవిల్లుతుందని అంటూ ఇన్నాళ్ళు ఊదర గొట్టిన పాలకులు ఒక వర్గంకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకోవడం వరుసగా నష్టం చేయడం విమర్శలకు దారి తీస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్ళలోనే అదాలత్ మసీదు ప్రాంతంలో మార్కెట్ యార్డును మున్సిపాల్టి వారు దురాక్రమణ చేయడం ఇప్పుడు స్వచ్చాభారత్‌తో ముస్లిం కుటుంబంను రోడ్డున పడేయం ఒక వర్గంకు మనోభావాలు దెబ్బతిసేలా పరిభ్రమించింది. భారత రాజ్యాంగం అందరిని సమదృష్టితో చూస్తుంది. కుల మత జాతి బేధంలేకుండా అందరని సమదృష్టితో చూస్తుంది.సర్వసత్తాక లౌకిరాజ్యంగా చెప్పుకునే దేశంలో ఓ ముస్లిం వృద్దురాలిని వీధిన పడేశారు. జడ్పీతో గత నలుబై ఏండ్లుగా వున్న పేగు బంధం తెంచి వేశారు. జిల్లా పరిషత్‌లో జరిగిన స్వచ్చాభారత్‌కు ముస్లిం వృద్దురాలి గుడిసెకు అసలు ఏమైనా సంబంధం వుందా అంటే అది లేదు. రోజు నీట్‌గా కల్లాపి చల్లి ఎంతో శుభ్రంగా వుంచేది సదరు మహిళ కానీ ఏపాడుపడ్డ కండ్లు పడ్డాయో కానీ ఆమె ఉపాధి కోల్పోయింది. పాపం డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడే తన కొడుకుతో ఆమె కొద్ది రోజులు కలెక్టరేట్ ముందు హోటల్‌లో కూలిగా చేరింది. పూలమ్ముకొన్న చోట కట్టెలు అమ్ముకొనే దుస్థితికి తీసుకొచ్చారని ఆమె ఎంతో కుంగి పోయింది. తన సొంత హోటల్‌లో కొడుకుతో కలిసి పనిచేసుకొనే ఆమె ప్రస్తుత వేగంకు తగ్గట్టు పనిచేయకపోవడంతో అక్కడ కూడా వారిని పనిలోనుంచి తీసివేశారు. ఇప్పుడు రోడ్డుపై పడ్డ వారు పస్తులతో వుండలేక స్వతంత్ర దేశంలో వీధి వీధి నాదే బ్రదర్ అంటూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అజ్మత్‌మా జానెడు పొట్టనింపుకొనేందుకు జానెడు జాగ ఇస్తే మతం కాదు మానవత్వం ఇంకా బతికి వుందని నిరూపితం అవుతోంది.