నిబంధనలకు విరుద్దంగా బస్సులు తిప్పడాన్ని సమర్థించం
హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న ప్రైవేట్ బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేయాడాన్ని ప్రైవేట్ బస్ ట్రావెల్స్ అసోసియేషన్ సమర్థించింది.నిబంధనలకు విరుద్ధంగా నియామాలు పాటించకుండా ట్రావెల్స్ బస్సులు తీప్పడాన్ని సమర్థించబోమని సంఘం అధ్యక్షుడు బోస్ అన్నారు.అదే సమయంలో ప్రమాదాలకు కేవలం ప్రైవేట్ బస్సులే కారణమని ప్రచారం చేయడం సరైంది కాదని అన్నారు.రోడ్డు భద్రతపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని ఇప్పటికైనా నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.పెరుగుతున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సామాజిక సేవగా భావించి బస్సులు నడుపుతున్నామని చెప్పారు.కోన్ని ట్రావెల్స్ చేస్తున్న తప్పులను అందరికీ ఆపాదించడం సరైంది కాదన్నారు.షోలాపూర్ బస్సు దుర్ఘటన కు కాళేశ్వరి యాజమాన్యం భాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు.ప్రమాదం జరిగిన వెంటనే ఆ సంస్థ యాజమాన్యం వెంటనే స్పంందించి అధికారులకు సహాకరించి ఉంటే పెద్దఎత్తున విమర్శలు వచ్చేవి కాదని అన్నారు.