నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ : ఐటీడీఏ పీవో

విశాఖపట్టణం,నవంబర్‌25(జనంసాక్షి) : నిరుద్యోగ యువతకు స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక శిక్షణను ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని రంపచోడవరం ఐటీడీఏ పీవో అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజీని చెల్లించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అధ్యయనం చేసి వాటిని క్షేత్రస్థాయిలో అమలకు పటిష్ఠమైన చర్యలు చేపడతానన్నారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతానని పీవో అన్నారు. ఏజెన్సీలో విద్య, వైద్య సేవల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని పీవో వెల్లడించారు.