నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసివేయండి
మెదక్, జూలై 25 : నిరుపయోగంగా ఉన్న బోరు బాబులను బండరాళ్లతో కాని, మూతలతో కాని మూసివేయాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు కోరారు. వివిధ ప్రాంతాలలో బావులలో చిన్నపిల్లలు పడి ప్రమాదాలకు గురౌతున్నారు. గ్రామాల్లో, పోలాల్లో బోరుబావుల వద్దకు పిల్లలను వెళకుండా, ఎటువంటి ప్రమాద సంఘటనలు జరుగకుండా చూడాలి. అక్కడి ప్రజలకు ముందు జాగ్రత్త కల్పించుటకు క్షేత్ర డివిజనల్, మండలస్థాయి అధికారులు కృషి చేయాలని అన్నారు.