నిరుపయోగంగా భూసార పరీక్షా కేంద్రాలు

జగిత్యాల జోన్‌, న్యూస్‌లైన్‌: రైతుల సాగు కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి. తమ భూమిలో సారం ఎంత ఉంది. ఏ రకమైన పోషకాలు లోపించాయి. ఎలాంటి ఎరువులు వేయాలి అనేది తెలుసుకోవడానికి వీలుగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇవి రైతులకు సేవలందించడంలో విఫలమవుతున్నాయి. జిల్లాలో కరీంనగర్‌, జగిత్యాల, మంథని, వేములవాడల్లో నాలుగు కేంద్రాలు ఉన్నాయి. ఆయా మార్కెట్‌ యార్డుల్లో వీటిని ఏర్పాటు చేశారు.

ఒక్కో కేంద్రానికి నిర్వహణ నిమిత్తం ఏడాదికి రూ. 25వేలు సైతం మార్కెట్‌ కమిటీలు చెల్లిస్తున్నాయి. అయితే సిబ్బంది లేరనే సాకుతో ఇవి ఎప్పుడూ మూసే ఉంటున్నాయి. ఒక్క కరీంనగర్‌ కేంద్రం మాత్రమే పని చేస్తోంది. పని చేయని కేంద్రాల్లోని పరికరాలు తుప్పుపట్టి పోయాయి. ఆయా కేంద్రాలకు పూర్తి స్థాయి శాశ్వత సిబ్బంది లేకపోవడం, డెప్యుటేషన్‌ మీద నియమిస్తుండడంతో వారు ఎప్పుడు వస్తారో, రారో తెలియుని పరిస్థితి ఉంది. ఒక్కో కేంద్రానికి ఒక ఏవో, ఇద్దరు ఏఈవోలు, ఇద్దరు అటెండర్లు ఉండాల్సి ఉండగా, అటెండర్లు వూత్రమే ఉంటున్నారు.

నీరు గారుతోన్న లక్ష్యం

ప్రతీ కేంద్రంలో ఆ డివిజన్‌లోని ఒక్కో వుండలానికి చెందిన దాదాపు 300 వుంది రైతుల భూముల్లల్లోని వుట్టిని పరీక్షించాలనేది లక్ష్యం. వుట్టిని పరీక్షించడం, ఏ ఎరువులను ఎంత మోతాదులో వేయాలో రాత పూర్వకంగా రైతులకు తెలియజేయడం వీరి పని. అయితే అధికారుల్లో జవాబుదారీతనం లేకపోవడంతో వారు రైతులకు అవగాహన కల్పించడం లేదు. రైతులే పట్టించుకోనప్పుడు తమకెందుకులే అని నిట్టూర్చుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.

మొక్కుబడిగా వారోత్సవాలు ఈ నెల ఒకటి నుంచి 8 వరకు భూసార పరీక్షావారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వీటినికూడా మొక్కుబడిగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జగిత్యాల, మల్యాల, మెట్‌పల్లి సబ్‌ డివిజన్ల వ్యవసాయాధికారుకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. సాధారణంగా మట్టి పరీక్ష చేయించాలంటే కనీసం నెల ముందు మట్టిని కేంద్రంలో అప్పగించాలి. అధికారులు చెప్పిన మాటలు రైతులకు చేరి వారు మట్టి పరీక్షలు చేయించుకునే వరకు ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేం. ఉన్నతాధికారులు స్పందించి భూసార పరీక్షలపై సకాలంలో రైతులకు అవగాహన కల్పించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.