నిరుపేదలకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన సర్పంచ్ సూర సమ్మయ్య జనంసాక్షి, కమాన్ పూర్ :తెలంగాణ ప్రభుత్వము జీవో నెంబర్ 58 59 ఉపసంహరించి నిరుపేదలకు ఉచిత పట్టాలు ఇప్పించాలని ప్రజావాణిలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ని సర్పంచ్ సూర సమ్మయ్య కోరారు. పాలకుర్తి మండలంలోని ఘన్ శ్యాం దాస్ నగర్, కన్నాల గ్రామస్తులైన వారు సుమారు 50 సంవత్సరాల నుండి నివసిస్తున్నారు. ఇక్కడ స్థానిక క్వారీ, క్రషర్స్, కేశోరామ్ ఫ్యాక్టరీ లలో కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. ఇక్కడున్న ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారు. ప్రతి గృహానికి ఇంటి నెంబర్ గ్రామపంచాయతీ వారు కేటాయించినారు. ఇంటి పన్నులు కూడా గత 50 సంవత్సరాలు నుండి గ్రామపంచాయతీకి చెల్లిస్తున్నారు.
గతంలో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంటి నివేషణ స్థలం సర్టిఫికెట్స్ ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. ఇంటి స్థలం రెగ్యులేషన్ కోసం ప్రభుత్వం వారు జీవో నెంబర్ 58, 59 ప్రకారం తీసుకొని రాగా వారు దరఖాస్తు చేసుకున్నరు.
కానీ నిరుపేదలమైన వారు ప్రభుత్వ నిర్దేశించిన విధంగా డబ్బులు చెల్లించలేమని వారు తెలియజేయడం జరిగింది.
స్థానిక పాలకుర్తి మండల తహసిల్దార్, సిబ్బంది మమ్మల్ని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించమని ఇబ్బంది పెడుతున్నారు. కావున మాయందు దయ తలచి జీవో నెంబర్ 58,59 ఉపసంహరించుకొని ఉచిత భూమి రెగ్యులరైజ్ చేయాలని మనవి. నిరుపేదలమైన మేము అట్టి స్థలం లకు డబ్బులు చెల్లించలేము.పాలకుర్తి తాసిల్దార్ స్థలాల పరిశీలనకు వచ్చి ఇక్కడ నివసిస్తున్న మహిళలను అసభ్యకరమైన మాటలతో దుర్భసలాడుతూ , పురుషులను గాజులు తొడుక్కున్నారా అని ప్రజా ప్రతినిధులను కూడా తిడుతూ ఇండ్లు కూలగొట్టిస్తానని బెదిరించినారు. ప్రభుత్వ ప్రభుత్వం సంక్షేమ పథకాలు రేషన్, కరెంట్, పెన్షన్, నిలిపివేస్తామని బెదిరించారు అని సర్పంచ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కన్నాల మాజీ సర్పంచ్ సూర సునీత, వార్డు సభ్యులు ఓర్సు కొమరమ్మ, కంకటీ శ్రీనివాస్, గుర్రం నంబయ్య, సంపంగి సాగర్, తాలరి శంకర్,కాల్వ అంజయ్య యాదవ్, సూర సంతోష్,సంపంగి కుమార్,దాడి పోచమల్లు, కిషన్, రాజేశం, దాసి రాజమౌళి, పాలకుర్తి మండల మరియు ఘాన్ శ్యామ్ దాస్ నగర్ ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.