నిరుపేదలకు ఐడీహెచ్‌ కాలనీ తరహాలో ఇళ్లు: సీఎం కేసీఆర్

PARSIGUTTA-CM

హైదరాబాద్:మనిషి పట్టుబడితే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారమయితదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ రాష్ర్ట సాధనే దీనికి నిదర్శనమన్నారు. అవగాహన లేక, చెప్పేవాళ్లు లేక మనం చెడిపోతున్నామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకున్న సికింద్రాబాద్ లోని పార్శీగుట్టలో ఆయన పర్యటించారు. సంజీవనగర్, లాలానగర్‌, అశోక్‌నగర్‌ ప్రాంతాల్లోని నిరుపేదలకు పద్మారావునగర్‌లో నిర్మిస్తున్న ఐడీహెచ్‌ కాలనీ తరహాలోనే ఇళ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. పార్శిగుట్టలో సీఎం కేసీఆర్‌ ‘స్వచ్ఛ హైదరాబాద్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బౌద్ధనగర్‌ డివిజన్‌లో ఉన్న పార్శిగుట్టలో సీఎం విస్త్రృతంగా పర్యటిస్తున్నారు. అంబర్‌నగర్‌, సంజీవనగర్‌ వంటి పలు బస్తీల్లో పర్యటిస్తూ అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. బౌద్దనగర్‌ డివిజన్‌లో ఉండే బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.