నిరుపేద కుటుంబానికి 250000రూపాయల విలువైన లోకల్ అందజేత

ఖానాపురం అక్టోబర్8 (జనం సాక్షి )
మండలంలోని నాజీతండ గ్రామపంచాయతీకి చెందిన
నిరుపేద కుటుంబం జాటోత్ రవి  కూతురు జాటోతు నవిత  అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలుసుకొనిఆ నిరుపేద కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి సహాయనిధిద్వారా రెండు లక్షల 50 వేల రూపాయలు ఎల్ఓసిని(LOC) మంజూరు చేయించారు. మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి(ఎల్ ఓసి ) ని శనివారం ఎంపీపీ వేములపెల్లి ప్రకాష్ రావు
జాటోతు నవిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా  ఎంపీపీ మాట్లాడుతూ ఆపదలో ఉండే పేద కుటుంబానికి అండగా ఎల్లవేళలా  నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి  ఉంటున్నారని నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి పెద్దన్నగా.. భరోసానిస్తున్నాడని, అన్నారు.
ఈ సందర్భంగా నవిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ…  మా కూతురు ఆరోగ్య పరిస్థితిని తెలిపిన వెంటనే స్పందించి మాకు 250000 రూపాయల ఎల్ ఓ సి ని ఇప్పించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి, ఎంపీపీ ప్రకాష్ రావు కి, అలాగేమా కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటున్న గ్రామ సర్పంచ్ బాదావత్ బాలకిషన్ కికృతజ్ఞతలుతెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాదావత్ బాలకిషన్, సర్పంచ్ లు లావుడ్య రమేష్ , గుగులోతు సుమన్ , మండల నాయకులు వేల్పుల లింగయ్య,భూక్యా వెంకన్న ,మండల యూత్ నాయకులు బానోతు శ్రీనివాస్ నాయక్ , ఉప సర్పంచ్ ఉపేందర్ ,గ్రామ పార్టీ అధ్యక్షులు పైండ్ల యాదగిరి , వార్డ్ సభ్యులు నరేష్,కోఆప్షన్ సభ్యులు బా తేజు ,  గ్రామ నాయకులు భూక్యా చందు, మోహన్,శంకర్, దుడయ్య, తదితరులు పాల్గొన్నారు.
Attachments area