నిరుపేద క్రీడాకారునికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సతీష్ కుమార్
హుస్నాబాద్ రూరల్ డిసెంబర్ 02(జనంసాక్షి)హుస్నాబాద్ పట్టణానికి చెందిన నిరుపేద క్రీడాకారుడు సైక్లిస్టు క్రీడాకారుడు బల్లు నిఖిల్ కు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చొరవతో లక్ష ఎనిమిది వేల రూపాయల విలువగల స్పోర్ట్స్ సైకిల్ ను అందజేశారు.జాతీయస్థాయిలో జరగనున్న సైక్లింగ్ పోటీలకు హుస్నాబాద్ నుండి బళ్ళు నిఖిల్ ఎంపిక కాగా వారి కుటుంబం నిరుపేద కావడంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంప్రదించారు.స్పందించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిరుపేద క్రీడాకారునికి అండగా నిలిచి,ప్రభుత్వం ద్వారా స్పోర్ట్స్ సైకిల్ ను అందజేశారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ… క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని అన్నారు.సైక్లింగ్లో జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్ర పేరును, ఆబాద్ నియోజకవర్గ పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , సిపి శ్వేత, అడిషనల్ కలెక్టర్, జిల్లా క్రీడలు యువజన సర్వీసుల శాఖ అధికారి జొన్నల నాగేందర్, జిల్లా సైక్లింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి జంగాపల్లి వెంకట నరసయ్య (కోచ్), అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొన్నారు.