నిర్మల్‌లో డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన
ఆదిలాబాద్ : జిల్లాలోని నిర్మల్‌లో డిప్యూటీ సీఎం మహమూద్అలీ, ఐటీ, పంచాయతీరాజ్ శాఖా మంత్రి కే. తారకరామారావు, అటవీశాకా మంత్రి జోరు రామన్న, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు సోమవారం పర్యటించారు. ఈసందర్బంగా వెల్మల్ గ్రామంలో వాటర్ గ్రిడ్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కామోల్ గ్రామంలో నిర్మితమవుతున్న వాటర్ గ్రిడ్ పనులను వారు పరిశీలించారు. అనంతరం పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు.