నిర్మల్‌లో వైకాపా ఆవిర్భావ వేడుకలు
నిర్మల్: నిర్మల్‌లో మంగళవారం వైకాపా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.