నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించాలి డిప్యూటీ కమిషనర్ నాగమణి
నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాల తలలింపు ప్రక్రియను సులభతరం చేయాలని అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ నాగమణి ఆధ్వర్యంలో నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంకటపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ హాజరై వివిధ కాలనీ అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషన్ మాట్లాడుతూ సి అండ్ డి కన్స్ట్రక్షన్ డిమాలేషన్ ప్లాట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పర్యావరణానికి మేలు జరగడంతో పాటు రీసైక్లింగ్ తో మంచి ఫలితాలు వస్తున్నాయి. దీంతో ప్రజలు భాగస్వామ్యం మరింత పెరగాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ముఖ్య అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్, ప్రోగ్రాం మేనేజర్ రఘు, మున్సిపల్ ఏం హెచ్ వో మంజుల, ఈ ఈ రాజు, ఏసిపి విజయ శ్రీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.