నిర్వీర్యం అవుఉతన్న ప్రభుత్వరంగం

ఏలూరు,జూన్‌20(జ‌నం సాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రభుత్వరంగం నిర్వీర్యమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి బిసి, మైనార్టీలకు ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఢిల్లీ తరహాలోకార్పొరేట్‌ కాలేజీల్లో, స్కూళ్లలో ఫీజుల నియంత్రణ ఉండాలని డిమాండ్‌ చేశారు. సహజ వాయువుల వెలికితీతతో సారవంతమైన భూములు నాశనం కావడమే కాకుండా పర్యా వరణానికి పెనుముప్పు వాటిల్లుతుందన్నారు. జిల్లాలోని అండలూరు, కృష్ణా జిల్లా మోదుగుమూడి, కొమరళ్లపూడి తీరప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. దీనివల్ల ఉత్ఫన్నమయ్యే మిథేన్‌ భూతాపాన్ని పెంచుతుందని, అణుధార్మిక రాడన్‌ వాయువు వెలువడి వాయుకాలుష్యం ఏర్పడుతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారని తెలిపారు.