నిలకడగా ఆడుతున్న రాజస్థాన్‌

జైపూర్‌: ఐపీఎల్‌ -6లో భాగంగా సవాయ్‌ మాన్‌సింగ్‌ క్రికెట్‌ స్టేడియంలో ముంబాయ్‌ ఇండియన్స్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నిలకడగా ఆడుతుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ 10 ఓవర్లు ముగిసే సరికి కేవలం ఒకే వికేట్‌ నష్టపోయి 88 పరుగులు సాధించింది. ఈ జట్టుకు ఓపెనర్లు వాట్సన్‌ (31), రహానే (34), పరుగులు చేసి మంచి శుభారంబాన్నిచ్చారు. 31పరుగులు చేసిన వాట్సన్‌ జౌటయ్యాక క్రీజులోకి వచ్చిన యాజ్ఞిక్‌ (22) పరుగులతో ఓపెనర్‌ రహానేతో కలిసి ఆడుతున్నాడు.