నిలిచిపోయిన బొగ్గు రవాణా
వరంగల్, కోల్‌బెల్ట్ : భూపాలపల్లిలోని సింగరేణి వేబ్రిడ్జిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బొగ్గు రవాణా నిలిచిపోయింది. గురువారం రాత్రి వీచిన గాలులతో విద్యుత్తు వైర్లు తెగిపడి వేబ్రిడ్జిని సంబంధించిన కంప్యూటర్లలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో బొగ్గు లారీలన్ని అక్కడే నిలిచిపోయాయి. దీంతో కేటీపీపీ విద్యుత్తు కేంద్రం, వివిధ పరిశ్రమలకు వెళ్లాల్సిన బొగ్గు రవాణాకు అటంకం ఏర్పడింది. స్థానిక సింగరేణి జీఎం నాగభూషణరెడ్డి వేబ్రిడ్జిని పరిశీలించారు.