నిషేధిత గుట్కా స్వాధీనం
మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)
ప్రభుత్వ నిషేధిత గుట్కా ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సురేష్ యాదవ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రేవూరు రోడ్డులో శ్రీ వెంకటేశ్వర కిరాణా షాపు అక్రమంగా నిల్వ ఉంచిన 7800 రూపాయల విలువ చేసే గుట్కా ను స్వాధీనం చేసుకుని కిరాణా షాప్ ఓనర్ గోళ్ల సతీష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ప్రభుత్వం నిషేధించిన వస్తువులను అమ్మిన, కొన్న చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు