నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
కరీంనగర్: తన చిలిపి చేష్టలతో.. అమాయక నవ్వులతో.. ఇంటిల్లిపాదిని సంతోషాల్లో ముంచే ఏడాదిన్నర చిన్నారి ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టెలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) అనే గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంటా విష్ణువర్థన్ రెడ్డి (18 నెలలు) అనే బాలుడు ఇంట్లో ఆడుకుంటూ నీటి తొట్టెలో పడి మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.