నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి
నిజామాబాద్,ఏప్రిల్7(జనంసాక్షి): గతంలో ఎన్నడూ లేని నీటి కరువు ఏర్పడిందని, బోర్లు ఎక్కడిక్డకే ఎండిపోయాయని జడ్పీ ఛైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. దీంతో ప్రజలు ఈ వేసవిలో పొదుపుగా నీటిని వాడుకోవాలన్నారు. వచ్చే వార్షకాలం నాటికి ఇంకుడు గుంతలను ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలన్నారు. వృథా నీటిని బోర్ల వద్ద ఇంకి పోయేలా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. ఎన్ని లక్షలు, కోట్లు సంపాదించినా నీరు లేకపోతే లాభం లేదన్నారు. కరవు కాలంలో ఉన్నాం కనుక వేసవికి ముందు నుంచే నీటి ఎద్దడి ఎదరవుతోందన్నారు. ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఎదురు కావడానికి ఎడాపెడగా చెట్లను నరుక్కోవడం, పర్యావరణాని/-ని దెబ్బతసీఉకోవడమే కారణం అన్నారు. ఓ 20,30 ఏళ్ల క్రితం వర్షాలు వారం పది రోజుల పాటు పడేవి. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం చెట్లను నరుక్కోవడమే. ఈ నేపథ్యంలో జనం జలం కోసం జాగృతం కావడంతో పాటు ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచాలన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఇప్పటి నుంచి కష్టపడితే జిల్లాలో రాబోయే రెండేళ్లలో నీటి ఎద్దడి పరిస్థితులు రాకుండా చేసుకోగలమని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరందిస్తాం. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మతులు చేయడం ద్వారా చెరువులు నిండితే సైతం భూగర్భ జలాలు పెరిగి బోర్లు బాగా నీటిని పోస్తాయి. అందుకు ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.