‘నీట్’ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వలేం
– సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ,జులై 14(జనంసాక్షి):నీట్‌పై ఆర్డినెన్స్ జారీ చేయటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నీట్ ఆర్డినెన్స్‌పై దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విూరు చేసిన పని మాకు రుచించలేదని జస్టిస్ అనిల్ ఆర్ దవే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తీర్పు తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయటం సరికాదని పేర్కొంది. ఆర్డినెన్స్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్‌పై విచారణ సమయంలోనే కొన్ని రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకున్నాయని ఈ సందర్భంగా కేంద్రం ధర్మాసనానికి వివరించింది. ఆర్డినెన్స్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే మళ్లీ విషయం మొదటికొస్తుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి విన్నవించారు. కోర్టు జోక్యం చేసుకోకపోతే ఇది ఇంతటితో ఆగదని, తుది తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిందేనని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు నష్టం కలగకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది.