నీడన బోధన డోర్నకల్ జూన్ 13 జనం సాక్షి
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థకు చేరిన తెల్ల బండ తండా ప్రాథమిక పాఠశాలను కూల్చివేశారు.అన్ని వసతులతో నూతన భవన నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి.సోమవారం బడులు పునః ప్రారంభమైన నేపథ్యంలో ఆ పాఠశాల విద్యార్థులుకు చదువుకొనుటకు బడి లేని పరిస్థితి.విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉపాధ్యాయులు ఓ ఇంటి ఆరుబయట విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.మరో గ్రామం హున్య తండాలో ఇదే పరిస్థితి.రోడ్డు పక్కన ఓ ఇంటి ఆవరణంలో చెట్టు నీడకు పిల్లలకు టీచర్లు చదువులు నేర్పిస్తున్నారు.వచ్చేది వానకాలం వాన వస్తే ఎటు పోవాలో తెలియని అయోమయ స్థితిలో విద్యార్థులు ఉన్నారు.మధ్యాహ్న భోజనం సైతం చెట్టు కిందనే పూర్తి చేశారు.పాఠశాల నిర్మాణం నిలిచిపోయిన నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఏది ఏమైనా భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.డి.ఈ మహేష్ ను జనం సాక్షి ప్రతినిధి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ…హున్య తండా పాఠశాల విషయమై కలెక్టర్కు నివేదించినట్లు తెలిపారు. నిర్మాణం తిరిగి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.పాఠశాలల నిర్మాణలు పూర్తయ్యేంత వరకు తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.