నీతిగల యూట్యూబర్ లకు ఆదరణ!

భారత్ లో నీతి, నిజాయితీ గల యూట్యూబర్ల కు ఆదరణ పెరుగుతున్నది. ప్రజల పక్షం వహించి, పాలకుల వైఫల్యాలను ఎండ గట్టే వారికి నీరాజనం పలుకు తున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీ ల మద్దతు దారుల అకృత్యాలు చూస్తున్నాము. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక యువతి పై బీజేపీ ఐటి సెల్ నిర్వాహకుల అగత్యం వెలుగు చూసింది. ఇలాంటి వారిదే రాజ్యం అయిన నేపథ్యంలో, జాతీయ మీడియా సైతం ఇలాంటి విషయాలు బయటకు తెలియకుండా కప్పి పెడుతున్న నేపథ్యంలో యూట్యూబర్ల ద్వారా ఈ ఘోర సంఘటన వెలుగు చూసింది.నిజాయితీ గా ఇలాంటి విషయాలను బయట పెట్టి ప్రభుత్వం ను నిల దీసిన,దేశంలో ఒకప్పడు ప్రజల ఛానల్ గా జాతీయ స్థాయిలో నిలిచిన ప్రనోయ్ రాయ్ కి చెందిన ఎన్డిటీవీ నీ గౌతమ్ అదాని కొనుగోలు చేసి ప్రభుత్వ ఒడిలో మీడియా గా మార్చేశారు. ముందు దాదాపు ఏడాది క్రితం ప్రైమ్ టైం రవీశ్ కుమార్ ఎన్డిటీవీ ని వదిలేసి యూట్యూబ్ పెట్టుకున్నారు. చాలా తక్కువ సమయం లో రవీష్ కుమార్ అఫిషియల్ యూట్యూబ్ కు 80 లక్షల సబ్స్క్రయిబర్స్ వచ్చేసారు. భారతదేశం లో ఒక యూట్యూబ్ ఛానల్ కు అతి తక్కువ సమయంలో ఇంతమంది సబ్స్క్రయిబర్లు లభించడం చిన్న విషయం కాదు. ఇప్పుడు తాజాగా రవీష్ కుమార్ బయటకు వెళ్లిన తర్వాత ఎన్డిటివికి కొంత ఊపిరి పోస్తున్న సంకేష్ ఉపాధ్యాయ, సౌరబ్ శుక్ల లు బయటకు వచ్చేసారు. దాదాపు క్రీమ్ ఉన్న ప్రజా ఆదరణ గల జర్నలిస్ట్ లందరు బయటకు వచ్చేసినట్లు ఉంది. సౌరబ్, సంకేత్ లు ఇద్దరు కలిసి ఇప్పుడు ది రెడ్ మైక్ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. వారం లోపే దీనికి 4 లక్షల మందికి పైగా సబ్స్క్రయిబ్ చేసే సారు. లక్షల మంది ఛానల్ ను చూస్తున్నారు.రెడ్ కలర్ అనేది జీవితానికి ఒక ప్రతీక, నమ్మకం, విప్లవం, ఒక సంఘర్షణ, ఒక ప్రేమ, జీవితం అందుకే ఆ పేరు పెట్టినట్లు కనిపిస్తున్నది.సంచలనాలు, ప్రసిద్ధి, ఫేమస్ ల కన్నా మాటలలో నిజం, నేల మీది నిజం చెప్పే జర్నలిస్ట్ లకు తిప్పలు తప్పవు!సమాజం లో అన్యాయం వైపు నిలబడి పోరాడే విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, కార్మికులు, కూలీలు, రైతులు, కూలీలు, మహిళలు, క్రీడా కారులు, ఇలా అన్ని వర్గాల ప్రజల కోసం పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుంది!అందుకే యూట్యూబ్ లు సక్సెస్ అవుతున్నాయి. ప్రజలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కన్నా ఎక్కువ యూట్యూబ్ ల నే నమ్మే పరిస్థితి వచ్చింది. యూట్యూబ్ ల మీద కూడ ఆంక్షల కు కేంద్రం ఇప్పుడు పూనుకుంటున్నది.నిజం ను తమకు వ్యతిరేకం అనుకునే పరిస్థితి ఉన్నది. అబద్దం ను పదే పదే ప్రచారం చేసే జాతీయ ఛానల్స్ కు ఇప్పుడు యూట్యూబ్ జర్నలిస్ట్ లు రవీష్ కుమార్, అభిసార్ శర్మ, పుణ్యప్రసూన్, ఆర్ఫా ఖానం, సాక్షి, అజిత్ అంజుమ్, బాషా, లాంటి వారు అంటే గిట్టదు. ప్రధానంగా బీజేపీ శ్రేణులు వీరిమీద కక్ష కట్టి మరీ దుష్ప్రచారం చేస్తున్నారు. ది వైర్, న్యూస్ క్లిక్ ల మీద ఐటి దాడులు కూడ చేసిన దాఖలాలు ఉన్నాయి. యూట్యూబర్స్ ను అదుపులో పెట్టాలని, వారి అనుకూల యూట్యూబర్స్ మీటింగులు కూడ పెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయాలని విజ్ఞప్తి చేసే పరిస్థితి వచ్చింది. నిజం చెప్పే, రాసే జర్నలిస్టులు పిడికెడు మాత్రమే ఉన్నా, పుట్టెడు అబద్దం చెప్పే, రాసే వారు వారితో తట్టుకో లేక పోతున్నారు. ఆగం, ఆగం అయిపోతున్నారు. నిజం ను చెప్పే వారు, తప్పును తప్పు అనే వారు ఇబ్బందులను ఎదురుకునే పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ రంగం లో మార్పు కోసం, దేశంలోని నిరుద్యోగ, నిరుపేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు కోసం, కుళ్ళిన, అవినీతి,అశ్రీత పక్షపాత రాజకీయం కు వ్యతిరేకం గా, అందులో ను మార్పు ను ఆశిస్తూ పని చేస్తున్న, కలం చేత బూని, గళం ను ఎక్కు పెడుతున్న,పవిత్రమైన జర్నలిజం తమ జీవితం గా బతుకుతున్న వారికి ప్రజల మద్దతు ఉండాలి!వారికి అండదండలు గా నిలవాలి!నాగేశ్వర్, మల్లన్న, రఘు, తులసి చందు,ఇలా ఇంకా ఎందరో హైదరాబాద్ కేంద్రం గా, జిల్లాల లోనూ యూట్యూబర్లు ప్రజల వైపు నిలబడి తమ గొంతు వినిపిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టు, మన సామాన్య శాస్త్రం, తెలుపు టీవీ ఎడిటర్,కందుకూరి రమేష్ బాబు లాంటి జనం గుండె చప్పుడు, సజీవ చిత్రాల ఫోటో గ్రాఫర్, పేస్ బుక్,వెబ్ సైట్ లో,విను తెలంగాణ పేరిట వస్తున్న నేల మీది నిజాల కదనాలు నిత్యం నిజాయితీ గా, నిజం చెబుతూ, దాని వెంటే లక్ష్యంగా నిలబడే వారు,యూట్యూబర్లు జిందాబాద్!

ఎండి.మునీర్,

సీనియర్ జర్నలిస్టు,

విశ్లేషకులు,

9951865223,