‘నీలం’ కలకలం

చెన్నై, ఆంధ్రాకు వాయు’గండం’
ఈదురు గాలులు.. భారీ వర్షాలు
చెన్నై విమానాశ్రయం , హైకోర్టు మూసివేత
హైదరాబాద్‌, అక్టోబర్‌ 31(జనంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పెను తపానుగా మారింది. చెన్నై తీరానికి సవిూపంలో 260 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృ తమైన ఉన్న ‘నీలం’.. ఉత్తర ఆగ్నేయ వైపు దిశను మార్చుకుని ముందుకు సాగుతోంది. బుధ వారం సాయంత్రానికి పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు చెన్నైలోని వాతా వరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభా వంతో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురు స్తాయని, 25 సెంటీవిూటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను ప్రభావం రాబోయే 48 గంటల్లో కోస్తా, రాయలసీమతో పాటు తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను
90 నుంచి 125 కిలోవిూటర్ల మేర బలమైన గాలులు వీస్తాయని, తీర ప్రాంత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు మరో 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. తుపాను నేపథ్యంలో.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి. అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించాయి. పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. చెన్నై, కడలూరు సహా 22 జిల్లాల్లో బుధవారం కూడా పాఠశాలలు మూసివేశారు. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 3 నుంచి 30 విూటర్ల ముందుకు వచ్చింది. అలలు రెండు విూటర్లకు పైగా ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మరోవైపు, తీర ప్రాంతాలను ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తాయి. మహాబలిపురంలో 13 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. అటు చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు, ఎలాంటి విపత్కర పరిస్థతులైనా ఎదుర్కొనేందుకు వీలుగా జాతీయ విపత్తు నివారణ సంస్థ, సైన్యం సర్వసన్నద్ధమయ్యాయి.
చిత్తూరు, నెల్లూరులలో భారీ వర్షాలు
నీలం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాల తూర్పు మండలాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచే ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తిరుమల, తిరుపతిలో ఉదయం నుంచి జోరుగా కురుస్తున్న వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిత్తూరులో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, పుత్తూరు, తంబళ్లపల్లి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేరుశనగ, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని పశ్చిమ మండలాల్లో కూడా ఓ మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చిత్తూరు కలెక్టరేట్‌, మదనపల్లి,
తిరుపతి ఆర్డీవో కార్యాలయాలతో పాటు అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. అటు నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో అలల ఉద్ధృతి పెరుగుతోంది. నెల్లూరు, కావలి, సూళ్లురు పేట, శ్రీహరికోట, కృష్ణపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. నాయుడుపేట, పెల్లకూరు మండలాల్లో నారుమళ్లు నీట మునిగాయి. చలి తీవ్రతకు కోట మండలం చిట్టేడులో ఓ వృద్ధురాలు మృతి చెందింది. మత్స్యకారుల చేపల చట్టా సముద్రంలో గల్లంతైంది. ఆలూరు మండలం ఇసుకపల్లి వద్ద సముద్రం 100 విూటర్ల మేర ముందుకు వచ్చింది. తడలో నాలుగు సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒంగోలు, సింగరాయకొండ, ఉలవపాడు, కందుకూరు, కొత్తపట్నం, ఉంగుటూరులలో వర్షాలు కురుస్తున్నాయి. చీరాల వాడరేవు, కొత్తపట్నం తీర ప్రాంతాల్లో ఏడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాల పర్యవేక్షణకు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు, పొట్టిసబ్బయ్యపాలెం వద్ద సముద్రం 25 విూటర్ల ముందకు వచ్చింది.
అప్రమత్తమైన తమిళనాడు..
నీలం తుపాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లోని విద్యాలయాలకు సెలవు ప్రకటించింది. కోస్తా జిల్లాల్లోని రెవెన్యూ అధికారుల సెలవులు రద్దు చేసింది. పల్లపు ప్రాంతాల్లో నీటిని తోడేందుకు భారీ జనరేటర్లతో మోటర్లు ఏర్పాటు చేసింది. తీరం దాటే సమయంలో విధ్వంసం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. ఆహార పదార్థాల కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టింది. చెన్నై తీర ప్రాంతంలో ఎనిమిదో నెంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను తీరం దాటే సమయంలో 1.5 విూటర్ల మేర అలలు ఎగిసిపడతాయని, 90 కిలోవిూటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తీరానికి సవిూపంలోని మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించారు.