‘నీలం’ బాధితులను ఆదుకుంటాం: చిరంజీవి
కృష్ణా: నీలం తుపాను బాధితులను అదుకుంటామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిరంజీవి నేడు పర్యటించనున్నారు. ఆయన కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఏలూరుకు రోడ్డు మార్గంలో వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద నష్టంపై ప్రధానికి వివరించి బాధితులకు మెరుగైన సాయం అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.