నీలిమ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు
హైదరాబాద్: ఇన్ఫోసిన్ భవనంపై నుంచి దూకి చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నీలిమ మృతి మిస్టరీని చేధించే దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చాక వేర్వేరు సమయాల్లో ప్రశాంత్‌కు పంపిన ఈమెయిళ్ల జాబితాను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. జులై 31వ తేదీన ప్రశాంత్‌కు నీలియ ఆఖరి ఈమెయిల్ పంపిందని, అందులో ప్రశాంత్‌ను పండుగా సంబోదిస్తూ మరు జన్మలోనైనా కలిసి ఉందామంటూ రాసినట్లు పోలీసులు గుర్తించారు. అంతకుముందు జులై 30న రాత్రి 8 గంటలకు తన సహోద్యోగులు ఏడుగురికి నీలిమ ఆమెయిళ్లు పంపినట్లుగా వెల్లడైంది. అందులో ఇదే తన ఆఖరి పనిదినమంటూ మెయిల్‌లో పేర్కొన్నట్లు స్పష్టమైంది. త్వరలోనే ఆమె మృతి మిస్టరీని చేధిస్తామని మాదాపూర్ డీసీపీ యోగానంద్ స్పష్టం చేశారు.