నుడా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
నల్లగొండ పట్టణ రహదారుల అభివృద్ధి,విస్తరణ,జంక్షన్ ల అభివృద్ధి,సుందరీ కరణ,పార్కుల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ అధికారులను,ఏజెన్సీ లను ఆదేశించారు
శనివారం నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి ట్రి ప్లాంటేషన్ చేసిన మొక్కల సంరక్షణ గురించి చర్చించారు. పార్కులో పిక్నిక్ జోన్ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మొక్కలు ఇంకా విరివిగా నాటాలని ఆయన తెలిపారు. ఎంట్రెన్సు వద్ద జరుగుతున్న పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారని అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లకు, ఏజెన్సీ నిర్వాహులకు సూచించారు.  పంచతంత్ర చుట్టూ గ్రీనరీని ఏర్పాటు చేయించాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. మర్రిగూడ బైపాస్ వద్ద జంక్షన్ పనులను పరిశీలించి చిన్న చిన్న పూల మొక్కలను, మ్యాటింగ్ ఏరియా మొత్తం గ్రీనరీ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ ట్యాపుతో కూడిన వాటర్ ఫౌంటేన్ ను ట్రయల్ రన్ ను పరిశీలించారు. సందర్శకులు కూర్చునే విధంగా సీటింగ్ బెంచీలను కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీ వారిని కోరారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రక్కన కెనాల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసే సుందరీకరణ గురించి మున్సిపల్ కమీషనర్, ఏజెన్సీ వారితో జిల్లా కలెక్టర్  చర్చించారు. అదే విధంగా కెనాల్ కు మరో పక్క ఐ.టి. టవర్ ప్రాంతంలో హ్యండ్ సింబల్ తో కూడిన కట్టడంపై చర్చించారు. కెనాల్ కు ఇరువైపుల ఏర్పాటు చేసే ఫౌంటేన్ ఏర్పాటు లో భాగంగా లైటింగ్ సౌకర్యం కోసం విద్యుత్ కనెక్షన్ అవసరం ఉందని తెలుపగా వెంటనే స్పందించిన కలెక్టర్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ ను  ఈ రోజే సంబంధిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.  హైదరాబాద్  రోడ్డు సబ్-స్టేషన్ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు వారం రోజుల్లో ఎలక్ట్రిసిటీ టవర్స్, పోల్స్, ట్రాన్సుఫార్మర్ల పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు.  వి.టి. కాలనీ వద్ద జరుగుతున్న  రోడ్డు పనులను పరిశీలించి బి.టి.ని త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ ను పునరుద్దరించడానికి సిద్దం చేయాలని తెలిపారు. రిలయన్సు ట్రెండ్సు ఎదురుగా ఉన్న డ్రైనేజీ పనులు ఒక వైపు పూర్తి అయినందున సంబంధిత ప్రాంతంలో బారీగేట్స్ పెట్టి మరో వైపు పనులు ప్రారంభించాలని సంబంధిత ఇంజనీర్ ను ఆదేశించారు.   బీట్ మార్కెట్ లో ఏర్పాటు చేస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించి వెల్ వేషన్ పనుల వివరాలపై మున్సిపల్ కమీషనర్ తో చర్చించి దీనిపై ప్రత్యేక శ్రద్ద చూపాలని కమీషనర్ ను కోరారు. మైసయ్య సర్కిల్ లో అన్నపూర్ణ క్యాంటిన్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అన్నపూర్ణ క్యాంటిన్ లోపల గల సీటింగ్, వాష్ బేషన్లు, ఇతర సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు.  క్యాంటీన్ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన సామాగ్రిని, ఇంటర్ లాకింగ్  బ్రిక్స్  పనులను పరిశీలించారు. మిగతా ఖాళీ ఉన్న స్థలంలో మొక్కలను నాటడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
క్లాక్ టవర్ సెంటర్ లో జరుగుతున్న పనులను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేయబోయే జాతీయ పతాకం, స్థూపం గురించి చర్చించారు. గడియారం స్థూపం మధ్య భాగం నుండి గ్లాస్ ఫౌంటేన్ గురించి తగు సూచనలు చేశారు. అదే విధంగా విద్యుత్ లైట్ల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.  క్లాక్ టవర్ సెంటర్ జంక్షన్ లో గ్రీనరీ, మొక్కలు నాటడం వంటి పనులతోపాటు సందర్శకుల కోసం సీటింగ్ బెంచీలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డా. కె.వి రమణాచారి, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీ నిర్వాహుకులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area