నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

కర్నూలు,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :  పిల్లల్లో నులిపురుగుల నివారణకు అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని డీఎంహెచ్‌వో తెలిపారు.  అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వాటిని పంపించాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనం తర్వాత పిల్లలకు ఈ మాత్రలు మింగించేలా పాఠశాల ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ
చేస్తున్నామని అన్నారు. జిల్లాలో 8 లక్షల మంది పిల్లలకు వీటిని పంపిణీ చేయాల్సి ఉందని, పిల్లల్లో రక్తహీనతను అధిగమించేందుకు 6 రకాల క్రిములు ఒక మాత్రతో చనిపోతాయని తెలిపారు. పిల్లల
ఆరోగ్యంపై నులిపురుగల ప్రభావం ఎక్కువగా ఉంటోందని అన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కార్యాచరణ చేపట్టారు.