నూతన ఆలయాలకు విరాళం అందజేత
ఖానాపురం సెప్టెంబర్ 23జనం సాక్షి
మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో రామాలయం శివాలయం నూతనఆలయాల నిర్మాణానికి గ్రామస్తులతో పాటు గ్రామానికి చెందిన మాడ్రాజు రేణుక వెంకన్న దంపతులు ఒక లక్ష నూట పదహార్లు (100116)రూపాయలు ఆలయ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ నడిపెల్లి రాజేశ్వర్ రావుకు శుక్రవారం అందజేశారు.అనంతరం వెంకన్న మాట్లాడుతూ ఆలయ నిర్మాణా పనులు టెంపుల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా వేగవంతంగా జరుగుతున్నాయని నాతోపాటు ప్రతి ఒక్కరు ఈ నిర్మాణంలో తమ వంతు సహకారం అందించి సహకరించాలని కోరారు. టెంపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ నడిపెల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ మరి కొంత మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కత్తల మాదయ్య, పోల్సాని సంపత్ రావు,అడ్డూరి మోహన్ రావు,కోదాటి వెంకటేశ్వరరావు, కోదాటి విద్యాసాగర్,ఎర్రబెల్లి సంపత్ రావు, పాలేపాటి సంపత్ రావు, కనుకుంట్ల కమలయ్య,ఎర్రబెల్లి శీను,కోదాటి సంపత్ రావు, మరియు గ్రామ సర్పంచ్ వెన్ను శృతి పూర్ణచందర్,గ్రామ పెద్దలు పోలే ఐలయ్య,ముదురు కుమారస్వామి, వల్లె వెంకన్న ,బత్తిని యాదగిరి, మరియు గ్రామస్తులు తదితరులుపాల్గొన్నారు.