నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 12(జనం సాక్షి): ఇటీవల కురిసిన వర్షాలలో జెకె నగర్ లోని ట్రాన్స్ఫార్మర్ కు పిడుగు పడి కాలిపోయింది. దీంతో కాలనీలోని ఓ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో బుధవారం నిర్మల్ నుండి నూతన ట్రాన్స్ఫార్మర్ తెప్పించి బిగించారు. మున్సిపల్ లో ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం, లైన్ మెన్ తిరుపతి,సంజీవ్,చిన్ని,ప్రవీణ్ రెడ్డి తదితరులున్నారు.