నూతన పారిశ్రామిక విధానానికి అనూహ్య స్పందన
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగష్టు 31 (జనంసాక్షి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ ముందుకు వచ్చింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో హిటాచీ సొల్యూషన్ గ్లోబల్ డెవలప్ మెంట్ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతన పారిశ్రామిక విధానంతో అనూహ్య స్పందన వస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తోపాటు హిటాచీ ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో హిటాచీ కంపెనీకి 7వందల మంది ఉద్యోగులు ఉండగా హైదరాబాద్ లోనే 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత. 35 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని వాటికి కేవలం 12 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. మరో 17 కంపెనీలు అనుమతుల కోసం సిద్ధంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చేతుల విూదుగా అనుమతి పత్రాలు అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ చైనా పర్యటన తర్వాత సౌత్ కొరియా, జపాన్ లలో పర్యటించే అవకాశముందని కేటీఆర్ వెల్లడించారు.
మరో కార్యక్రమంలో …
మహిళల ఆర్థిక స్వాలంబనే లక్ష్యంగా ఏర్పాటైన స్త్రీనిధి బ్యాంక్ పనితీరుపై పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు సచివాలయంలో సవిూక్ష సమావేశం నిర్వహించారు..బ్యాంకు పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు..బ్యాంకు కార్యాకలపాలు,సాధించిన లక్ష్యాలను మంత్రికి అధికారులు వివరించారు..మరింత మెరుగైన పనితీరు కోసం అధికారులకు మంత్రి కొన్ని సూచనలు చేశారు. వెనకబడిన ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు ప్రతీ మహిళ ఆర్థిక స్వాలంబన పొందేలా స్త్రీనిధి కార్యకలాపాలను రూపొందించాలన్ని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.. ఎస్సీ,ఎస్టీ లతో పాటు బలహీన వర్గాలకు మరింత దగ్గరయ్యేందుకు కొత్త ప్రణాళికలు తయారుచేయాలన్నారు..తెలంగాణ పల్లె ప్రగతితో పాటు గ్రావిూణాభివృద్ధి శాఖ అమలుచేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో స్త్రీ నిధి కార్యకలాపాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు..కళ్యాణలక్ష్మీ లాంటి పథకాలను స్త్రీ నిధి తో మరింత మెరుగ్గా అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు..రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ప్రతీ మహిళకు భీమా సురక్ష అందేలా చూడాలన్నారు..ఇందుకోసం సెర్ప్, స్త్రీనిధి,గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులతో త్వరలోనే ఉమ్మడి సమావేశం ఏర్పాటుచేయాలని ఆదేశించారు..సెప్టెంబర్ 2న హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్టీయూలో జరిగే స్త్రీనిధి వార్షిక సర్వసభ్య సమావేశానికి మంత్రి కేటీఆర్ ను అధికారులు ఆహ్వానించారు..2015-16 సంవత్సరానికి 1050 కోట్ల రుణ సహాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు..ఈ కార్యక్రమంలో పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్,స్త్రీ నిధి బ్యాంకు ఎం.డి. విద్యాసాగర్ పాల్గొన్నారు..