నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.

– మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి.
నియామక పత్రం అందజేస్తున్న నాయకులు.
బెల్లంపల్లి, అక్టోబర్ 13, (జనంసాక్షి)
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళిత, గిరిజన, బహుజనుల ప్రజల మనోభావాలు గౌరవిస్తే అందరి ఆరాధ్య దైవం బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును కొత్త పార్లమెంట్ భవనానికి నామకరణం చేయాల్సిందేనని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ మాల మహానాడు పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షునిగా చీటీ పోషం మరియు పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శిగా కొప్పుల రవళిని నియమించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించే సచివాలయానికి ఎవరు అడగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయడం మాల సమాజం నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నాం అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి దళిత గిరిజన బహుజన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారతదేశంలో మచ్చలేని మనిషి అయినా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరును ఢిల్లీలో నూతనంగా నిర్మించే పార్లమెంటు భవనానికి నామకరణం చేయాల్సిందే అన్నారు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు నామకరణం చేయకపోతే దళిత గిరిజన బహుజనుల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే అవుతుందన్నారు. సంవత్సరాలుగా ఇండియన్ కరెన్సీ మీద అంబేద్కర్ గారి ఫోటో ముద్రించాలని కోరుతున్నప్పటికీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు ఈ అంశం చాలా బాధాకరం అన్నారు. దళితులకు రిజర్వేషన్లు 15% నుంచి 25% శాతానికి పెంచాలని ఎన్నోసార్లు ఉద్యమం చేసిన ఏలాంటి స్పందించకపోవడం బాధాకరం అన్నారు. కొత్త పార్లమెంటు భవనం పక్కన 500 అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడి చాలా సంవత్సరాలు అయినా ఇంతవరకు దళితులకు గిరిజనులకు సంబంధించి ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశ పెట్టలేదని, ఈ ఘటన దళిత, గిరిజల్ని అవమానపరిచినట్టే అన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బాని రాజనర్సు, జిల్లా అధ్యక్షురాలు దాసరి జయ, నియోజకవర్గ అధ్యక్షురాలు లింగాల అమృత, నియోజకవర్గ అధ్యక్షుడు ఎరుకల శ్రీనివాస్, గుండ రాజవ్వ, శారద, లక్ష్మి, మమత ,ఆశమ్మ, రాధ, కావ్య, మానస తదితరులు పాల్గొన్నారు