నూతన పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీపీ
ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి )
మండలంలోని మనుబోతులగడ్డ గ్రామం లో నూతనంగా మంజూరైన నూతన పెన్షన్ లబ్ధిదారులకు శనివారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు గ్రామ సర్పంచ్ సోమయ్య తో కలిసి నూతన పెన్షన్ దారులకు పెన్షన్లు అందజేశారు. అలాగే ధర్మారావు పేట గ్రామంలో గ్రామ సర్పంచ్ శృతి పూర్ణచంద్ర ఆధ్వర్యంలో నూతన పెన్షన్ దారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కెసిఆర్ మన రాష్ట్రము లోనే వివిధ వర్గాలకు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నారు అన్నారు. మరియు దేశ రాజకీయలలోకి అడుగు పెడుతున్న బి ఆర్ ఎస్ పార్టీని అందరూ ఆదరించి దేశ ప్రజలకు కూడా ఇలాంటి పతకాలను అందించే అవకాశం ఇవ్వాలని కోరారు . ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబెర్ మస్తాన్, సర్పంచ్. సోమయ్య,బోడ. పూలు, తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు బాలు, బోదాసు.ఐలయ్య, పోతుల. మల్లేష్,మిట్టేపెల్లి. యాకయ్య, జున్ను. బిక్షం, బొంత. సారయ్య, ఎంపీటీసీ విజకర్ రావు, నడిపెల్లి రాజేశ్వరరావు,
ఓర్స్. ఉప్పలయ్య, సుర. ఉప్పలయ్య, డోలి, శివరాత్రి. ఐలయ్య మరియు పోస్టుమాస్టర్. అఫ్రోజ్, గ్రామ కారోబార్ సుర. రాజు , నూతన పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.