నూతన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేత

చౌడాపూర్,అక్టోబర్ 10( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పెన్షన్లను భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన చౌడాపూర్ మండల నాయకులు నూతన ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు సర్పంచ్ కొత్త రంగారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్లు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు మాట్లాడుతూ…వయోవృద్ధులకు సీఎం కేసీఆర్ కొడుకు లాంటి వ్యక్తి అని రాష్ట్ర ముఖ్యమంత్రిని కొనియాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి శంకర్,డిప్యూటీ సర్పంచ్ శివకుమార్,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు యాదయ్య,వార్డు మెంబర్లు అశోక్,రాజు,రాములు గౌస్,ముబిన్ తదితరులు పాల్గొనడం జరిగింది.