నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి, ఇద్దరి మృతి

హైదరాబాద్‌: నూతన సంవరత్సరం వచ్చీరావడంతోనే నగరంలో ఇద్దరిని బలి తీసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 1లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కారు, ద్విచక్ర వాహనం ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో ఈ ప్రమాదం జరగడంతో జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.