నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనాల పనులను వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ కె. శశాంక

-గాంధీ పురం లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హరితహారం నర్సరీని పరిశీలించిన కలెక్టర్

మహబూబాబాద్ బ్యూరో-జూన్22(జనంసాక్షి)

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనాల పనులను బుధవారం రోజున జిల్లా కలెక్టర్ కె. శశాంక డి ఎఫ్ ఓ రవికిరణ్ తో కలిసి పరిశీలించారు, గత రెండు నెలల్లో చేసిన నిర్మాణాల పనుల పురోగతిని అడిగి తెలుసుకుని లేబర్ శాతాన్ని పెంచి త్వరితగతిన పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని, బయట క్లీనింగ్ పనులను పూర్తి చేసి గ్రీనరీ ప్లాంటింగ్ చేయాలని, కారిడార్లో వర్షపు నీరు పడకుండా, నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని, వేగవంతం చేసి పనులను పూర్తి చేయాలని పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం మహబూబాబాద్ మున్సిపాలిటీ శివారులో గాంధీ పురం లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హరితహారం నర్సరీని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, డి ఎఫ్ ఓ రవికిరణ్ లతో కలిసి సందర్శించారు. నర్సరీలో 80 వేల మొక్కలు 12 రకాలు, బెడ్స్ లలో పెంచుతున్నట్లు, ఈ సంవత్సరం కు గాను 50000 మొక్కలను పంపిణీ చేయుటకు, నాటుటకు సిద్ధంగా ఉన్నాయని, 30 వేల మొక్కలు వచ్చే సంవత్సరం కు పంపిణీ చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇతర నర్సరీలకు ఆదర్శంగా మొక్కలను కాపాడుతున్నoదుకు సంబంధిత అధికారులను అభినందిస్తూ, 4 నుండి 6 ఫీట్ల ఎత్తులో ఉన్న మొక్కలను పంపిణీ చేయాలని, నర్సరీ నుండి మొక్క నాటే వరకు కంటికి రెప్పలా కాపాడాలని, లోడింగ్, అన్ లోడింగ్ లో పలు జాగ్రత్తలు వహించాలని, క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవాలని, మొక్క నాటేటప్పుడు సుమారు 2 ఫీట్ల లోతు గుంతలు తీసి నాటాలని, నాటిన ప్రతి మొక్కను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ తానేశ్వర్, ఎఫ్ డి ఓ కృష్ణమాచారి,  మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, డీ ఈ ఉపేందర్, ఎఫ్ ఆర్ వో కరుణాకర చారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.