నెంబర్‌ వన్‌గా 287వ వారం

లండన్‌: వింబుల్డన్‌ ఛాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌ మరో అరుదైన రికార్డ్‌ సృష్టించాడు. టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక వారాలు వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ కలిగిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ప్రస్తుతం నెంబర్‌ వన్‌ హోదాలో ఫెదరర్‌ 287వ వారం పూర్తి చేసుకున్నాడు. వచ్చే అగస్టులో 31వ ఏట అడుగుపెడుతున్న 286 వారాలు నెంబర్‌ వన్‌గా ఉంటూ సంప్రాస్‌ రికార్డును అధిగమించాడు. ఇటీవలే వింబుల్డన్‌ టైటిల్‌తో కెరీర్‌లో 17వ గ్రాండ్‌ శ్లామ్‌ కైవసం చేసుకున్న ఫెడెక్స్‌ అగ్రస్థానాన్ని కూడా సాధించాడు. దాదాపు రెండేళ్ళ పాటు గ్రాండ్‌ శ్లామ్‌ గెలవని ఈ స్విస్‌ థండర్‌కు అండన్‌ ఒలంపిక్స్‌ ముందు వింబుల్డన్‌ విక్టరీ ముంచి ఉత్సాహాన్నిచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్‌ చరిత్రలో అండ్రీ అగస్సీ తర్వాత టప్‌ ప్లేస్‌లో ఉన్న రెండో పెద్ద వయస్సునిగా రికార్డులెక్కాడు. తాజా రికార్డులపై సంతోషం వ్యక్తం చేసిన ఫెదరర్‌ మరిన్ని వైలురాళ్ళు అందుకోగల సత్తా ఉందని వ్యాఖ్యానించాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ఫెడెక్స్‌, మాజీ నెంబర్‌ వన్‌ జొకోవచ్‌ కంటే 75 పాయింట్లు ముందున్నాడు. దీని ప్రకారం లండన్‌ ఒలంపిక్స్‌ ముగిసే వరకూ స్విస్‌ థండర్‌ టాప్‌ ప్లేస్‌కు ఢోకా లేదు. గత ఏడాది 63-6 రికార్డ్‌ నమోదు చేశాడు. గతంలో ఫెదరర్‌ 2004 ఫిబ్రవరి నుండి 2008 అగస్ట్‌ వరకూ నెంబర్‌ వన్‌ హోదాలో ఉన్నాడు. తర్వాత కొన్నాళ్ళ పాటు దానిని కోల్పోయిన ఫెడక్స్‌ మళ్ళీ 2009 జూలైలో చేజిక్కించుకున్నాడు.