నెట్‌ఫ్లిక్స్‌లో 22నుంచి ఎఫ్‌`3 స్ట్రీమింగ్‌

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్‌3
ఈనెల 22 నుంచి నెట్‌ ప్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాలోని ఫన్‌ అండ్‌ ఫ్రస్టేష్రన్‌ను ఇప్పుడు విూరు, విూ కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చుని ఎంజాయ్‌ చేయొచ్చని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ మేరకు నెట్‌ప్లిక్స్‌ ట్వీట్‌ చేస్తూ.. ’ట్రిపుల్‌ ది ఫన్‌, ట్రిపుల్‌ ది ఫన్నీ, ట్రిపుల్‌ ది ఫ్రస్టేష్రన్‌.. జూలై 22న నెట్‌ప్లిక్స్‌లో ఎఫ్‌ 3 రిలీజ్‌ రెడీ అయ్యింది’ అంటూ రాసుకొచ్చింది. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటించగా, రాజేందప్రసాద్‌, మురళీ శర్మ, అలీ, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ’దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలై త్రిపుల్‌ బస్టర్‌గా నిలిచింది. డబ్బు చుట్టూ తిరిగే కథకు వెంకీ, వరుణ్‌ల కామెడీ జత కావడంతో ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కడుబ్బా నవ్వించింది. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకుంది ఈ చిత్రం. ఇక ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసి నవ్వుకునేందుకు ఆడియన్స్‌ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎఫ్‌ 3 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. అలాంటి వారి ఎదురుచూపులకు మేకర్స్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ ప్లిక్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించనుంది.