నెన్నెలలో ప్రజావాణి.
: ప్రజావాణిలో పాల్గొన్న ఆర్డీవో శ్యామల దేవి.
నెన్నెల,సెప్టెంబర్26(జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ఆర్డీవో శ్యామల దేవి హాజరయ్యారు. మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ లో నమోదు చేయబడుతాయని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అధికారులకు సూచనలు అందించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీఓ వరలక్ష్మీ, ఏపీఓ నరేష్, ఏపీఎం విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.